Web Designer |
*వెబ్ డిజైనర్ గా కెరీర్ ప్రారంభం చేయడానికి కూడా మొదటగా మనలో ఉండవలసిన స్కిల్ క్రియేటివిటీ తో కూడిన కష్టపడ గలిగే మనస్తత్వంతో పాటూ మంచి పరిశీలన ఇంటర్నెట్ పరిజ్ఞానం. వెబ్సైట్ ను డిజైనింగ్ చేయడానికి ముందుగానే మనకి ఆ సైట్ ఎ విధంగా ఉంటే ఆకర్షణీయంగా ఉంటుందో ఊహించగలగాలి.
* వీటితో పాటుగా సమయానికి మనం కోడింగ్ ఫైనల్ వెబ్సైట్ ను మన క్లయింట్ కు అందించే విధంగా మనం సమయానుకూలంగా వర్క్ చేసి అందించ గలగాలి. దీనితో పాటుగా ప్రస్తుతం ఉన్న అంశాలను గురించి, (ట్రెండింగ్ టాపిక్స్ గురించి), సోషల్ మీడియా పట్ల అవగాహన మనకి మంచి వెబ్సైట్ ను తయారు చేయడానికి ఉపయోగపడతాయి.
* టెక్నికల్ అంశాలకు వస్తే ప్రస్తుతం మనం వెబ్సైట్ లో ఉపయోగిస్తున్న HTML 5, CSS, Java Script and Website Management లో మంచి పట్టు సాధించాలి. దీని కోసం మనం మన కోడింగ్ స్కిల్స్ ను పెంచుకోవడానికి వెబ్సైట్ కోడింగ్ రాసుకుంటూ ప్రాక్టీస్ చేయడం కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద పట్టు సాధించాలి. దీని కోసం మనం ఉచితంగా బ్లాగ్ థీమ్స్ ని HTML స్క్రిప్ట్ మోడ్ లో ఉంచి ప్రాక్టీస్ చేయవచ్చు.
*బ్లాగర్ మాత్రమే కాకుండా WordPress, Wix , Weebly, Mediam, Ghost, Joomla సర్వీస్ లలో ఉచిత బ్లాగర్ ను అందిస్తున్నాయి. సరైన పట్టుదలతో ప్రాక్టీస్ చేసినట్లయితే మనం ఎన్నో అవకాశాలని అందిపుచ్చుకోవచ్చు అనడంలో సందేహం లేదు. డ్రీమ్ వీవర్ అనే సాఫ్ట్ వేర్ ఉపయోగించి మన కోడింగ్ స్కిల్స్ ని పరిక్షించవచ్చు. ఇదే కాకుండా మనకి ఉచిత వెబ్సైట్ , వర్డ్ ప్రెస్ వెబ్సైట్ థీమ్స్ గూగుల్ ద్వారా డౌన్లోడ్ చేసి పరిక్షించవచ్చు.
* ఒక వెబ్ సైట్ మరియు డిజైనింగ్ సమయంలో కంటికి ఎలాంటి స్ట్రెస్ కలిగించని కలర్స్ ఉండేలా చూసుకోవాలి. అదే కాకుండా వెబ్ సైట్ టాపిక్ ని బట్టి అక్షరాలను వాడటానికి సెలక్ట్ చేసుకోవాలి. బ్యాక్ గ్రౌండ్ కలర్స్ , ఫాంట్ కలర్ కంపోజింగ్ ని బట్టి కలర్ కంపోజింగ్ అంశాలను వాడాలి.
*ఒక వెబ్ సైట్ డిజైనింగ్ నందు మనం ఉపయోగించే డొమైన్ పేరు, యూజర్ ఫ్రెండ్లీ డాష్ బోర్డ్ లో ఉండే రకరకాల కంపోజింగ్ కి సంబందించి అవగాహన కలిగి ఉండాలి.దీనితో పాటుగా వెబ్ సైట్ లో వాడే ఫోటోస్ క్లారిటీ ఉండే విధంగా . కలర్ బాలన్స్ సరిపోయే విధంగా ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ పట్ల మంచి అవగాహన కలిగి ఉండాలి. యూజర్స్ కు వెబ్సైట్ లుక్ ఎలా కనిపిస్తుందో మొబైల్ , ట్యాబ్ మరియు లాప్టాప్ లో ఏ విధంగా కనిపించేదీ ముందుగా పరిక్షించుకోవాలి.
* ఒక వెబ్ డిజైనర్ గా HTML 5, CSS, Java Script and Website Management ఇవి ఎలాగూ నేర్చుకోవలసిందే. ఇదంతా బేసిక్, కానీ ఈ స్కిల్స్ తో బాటుగా Photoshop ( Logo and Photo Editing ), Video Cutting and Editing ( for Clip management ),Update Content Knowledge ( Tags and Consol )తెలిసి ఉండాలి. దీనితో పాటుగా అవసరమైన సమాచారాన్ని యూనీకోడ్ ద్వారా అందించడానికి తెలుగు టైపింగ్ మెథడ్ ( యూనీ కోడ్ ) స్కిల్స్ ఉండాలి.
మీకు అవసరమైన లింక్స్ :
WordPress, Wix , Weebly, Mediam, Ghost, Joomla (కోడ్ టెస్టింగ్ కోసం) HTML 5 ( కోడింగ్ )
ఫోటో షాప్ ( ఫోటో గ్రాఫిక్స్ సాఫ్ట్ వేర్)
డ్రీంవీవర్ సాఫ్ట్ వేర్ ( టెస్టింగ్ కోసం )
మీరు మీ కెరీర్ ను ఫ్రీ లాన్సింగ్ వెబ్ డిజైనింగ్ వర్క్ ద్వారా మొదలు పెట్టాలని అనుకుంటే టాప్ 10 ఫ్రీ లాన్సింగ్ వెబ్సైట్స్ ద్వారా వివిధ రకాల వర్క్స్ పొందడానికి ఇక్కడ ప్రెస్ చేయండి.
0 Comments