ట్రావెల్ కన్సల్టెంట్ గా మారాలంటే...

Travel Consultant
ప్రయాణాలు చేయడం కొత్త కొత్త ప్రదేశాలను సందర్శిస్తూ, ప్రకృతి అందాలను చూస్తూ శ్రమను మరచి పోయే తత్వం మీలో ఉందా ...? అయితే మీరు ఆ ప్రదేశాలను చూసే ఆసక్తిని, స్వయం ఉపాధిని పొందేందుకు సరైన మార్గం ట్రావెల్ కన్సల్టెంట్ గా మారడం ఒక్కటే సరైన మార్గం. మరి ఒక ట్రావెల్ కన్సల్టెంట్ గా మీరు మారాలంటే... 

మొదటగా మీరు ఏ ప్రదేశాలకు ట్రావెల్ కన్సల్టెంట్ గా మారాలని అనుకుంటున్నారో ఆ ప్రదేశాలను గురించి ముందుగా చూసి అక్కడ స్థితిగతులు, అక్కడ ఉన్న పూర్వ విశేషాలను గురించి తెలుసుకోవాలి. దీని కోసం మనకి ఇంటర్నెట్ లో వీడియోలా ద్వారా , సమాచారాన్ని తెలుసుకొని, ఆ ప్రదేశాలను చూసి రావాలి. అంటే మనం ఎ ప్రదేశం గురించి అయితే చెప్పలనుకుమ్తున్నామో అక్కడ ఉన్న పరిస్థితులు క్షుణంగా తెలుసుకోవాలి. 

ఒక టూర్ గైడ్ గా మీరు మారాలని అనుకున్నట్లయితే ముందుగా ఆ చుట్టూ ప్రదేశాలలో టూర్స్ వేసే వివిధ కన్సల్టెన్సీ ఆఫీసుల వివరాలను సేకరిమ్చుకోవాలి. మన సలహాను అనుసరించి టూర్ ప్యాకేజ్ లను మాట్లాడే వారి నుండి కొంత శాతాన్ని మనం కన్సల్టన్సీ ఫీజ్ గా పొందవచ్చు. రికమెండ్ వివరాలను బట్టి ఉంటుంది. 

మనం ఎదో ఒక ట్రావెల్ ఏజన్సీకీ మాత్రమే పని చేసినప్పుడు దానికి చెందిన టూర్ ప్లాన్స్ , సాలరీ ప్యాకేజి ని బట్టి మాత్రమే సంపాదించుకోవడానికి వీలు కలుగుతుంది. కాబట్టి మనం చేయాల్సింది. ఇండిపెండెంట్ ట్రావెల్ కన్సల్టెంట్ గా ఉండడం ద్వారా ఎక్కువ సంపాదన ను పొందవచ్చు. కాకుంటే ఈ విధానం లో చాలా చురుకుగా పని చేయాలి. 

ట్రావెల్ ఏజన్సీ లతో కొత్త కొత్త టూర్ ప్యాకేజీ లను ప్లాన్ చేయడానికి సహాయంగా ఉండాలి. దీని ద్వారా మన పర్సెంటేజ్ పెంచుకోవచ్చు. టూర్ ప్లాన్ మొదలయ్యే కాలాన్ని అనుసరించి ప్లాన్ చేయాలి. ఉదా : దేవి నవరాత్రులు ( శక్తి పీఠాలు ),ఎండాకాలం సమయంలో ప్రకృతి సంబంధిత ప్రదేశాలు... ఇలా ఉండే విధంగా చూసుకోవాలి. 

ట్రావెల్ కన్సల్టెంట్ గా మారడానికి ప్రత్యేకించి ట్రైనింగ్ ఏమి అవసరం లేదు. మనకు కావాల్సిందల్లా టూర్స్ పైన ఉన్న ఆసక్తి అవసరం. దానికి సంబంధిత సమాచారాన్ని తెలుసుకోవడానికి మంచి ప్లానింగ్ అవసరం. ఒక్కో సంధర్భంలో చాలాకష్టనష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

మనం ట్రావెల్ కన్సల్టెంట్ గా మారడానికి ముందుగా మన ఉపాధి మొదలు పెట్టడానికి ముందు గా ఫోటోలు, ఆ ప్రదేశం గురించిన సమాచారాన్ని టార్గెట్ చేయబడిన వారికి పూర్తిగా అర్ధమయ్యే స్థానిక భాషలో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ను ఉపయోగించుకొని ఎక్కువ మంది టూర్ కి సిద్ధం అయ్యేలా చిన్న వెబ్ సైట్ కూడా అందు బాటు లోకి తీసుకు రావాలి. ఇది చాలా అవసరం. ఎప్పటికప్పుడు స్పెషల్ డిస్కౌంట్ టూర్ ప్యాకేజ్ సమాచారాన్ని పబ్లిష్ చేయాలి. 

ట్రావెల్ కన్సల్టెంట్ గా మారినప్పుడు ప్రత్యెక సెలవులు, విశ్రాంతి కోరుకోవద్దు. ఎందుకంటే మన దగ్గర నుండి ఒక ట్రిప్ గైడ్ ని కోల్పోయినప్పుడు తిరిగి మళ్ళీ మన దగ్గరకి తెచ్చుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి ట్రావెలింగ్ పట్ల అభిరుచి ఉన్న వాళ్ళు మాత్రమె ఈ ఫీల్డ్ లో సెట్ కాగలుగుతారు. 

ట్రావెల్ కన్సల్టెంట్ గా కెరీర్ మొదలు పెట్టినప్పుడు రకరకాల వ్యక్తిత్వాలు ఉన్న వ్యక్తులను డీల్ చేయగలగాలి. హోటల్ కన్సల్టెంట్ ద్వారా మనకి అనువైన ప్యాకేజ్ ల గురించి చర్చించి ఉంచుకోవాలి. దీనివల్ల మన పర్సెంటేజ్ మనకు లభిస్తుంది. అలాగే దీని కోసం మనం మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలి. 

ప్రాంతీయ భాషలను గురించి తెలుసుకొని ఎంతో కొంత ప్రావీణ్యత సంపాదించుకోవాలి. మన పరిసర ప్రాంతాల్లో ఎన్నో చూడతగ్గ ప్రదేశాలకు ఎటువంటి ఆదరణ లేకుండా , మహోన్నత చరిత్ర గల ప్రదేశాలను గురించి పూర్తి అవగాహన పెంచుకోవడం ద్వారా మొదటగా ప్రాంతీయ టూరిస్ట్ గైడ్ గా , కన్సల్టెంట్ గా మీ కెరీర్ కు తోలి అడుగులు వేయవచ్చు. 

మీకు అవసరమైన లింక్స్ :
ట్రావెల్ కన్సల్టెంట్ గా మీరు ఇక్కడ కొంత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. 
తాజ్ మహాల్ , ఊటీ , మౌంట్ అబూ... ఇలా ఎన్నో ప్రదేశాల గైడ్
Click Here ( మీకు కావాల్సిన సమాచారాన్ని మీ భాషలో పొందడానికి )

Post a Comment

0 Comments