Slide Presentation |
మొత్తం టాపిక్ ను షార్ట్ కట్ గా టైం షెడ్యూల్ కి తగినట్లు రాసుకోవాలి. ఆ తరువాత ప్రజంటేషన్ కి తగినట్లుగా బ్యాక్ గ్రౌండ్ ఇమేజెస్ , కంటెంట్ బ్లాక్స్ ని దౌన్ లోడ్ చేసుకోవాలి. దీనికోసం మీరు ఇంటర్ నెట్ నందు వాటర్ మార్క్ లేని ప్రజంటేషన్ లేఅవుట్ లను వాడాలి.
అవసరం అనుకుంటే బ్యాక్ గ్రౌండ్ థిక్ నెస్ ను తగ్గించి అయినా సరే ఫాంట్ టెక్స్ట్ కనిపించేలా చేయాలి. స్లైడ్ ప్రజెంటర్ గా ఒక ప్రజంటేషన్ లో ఉపయోగించే ఫీల్డ్ ఆధారంగా వైట్ కలర్ , గ్రీన్ కలర్ బోర్డ్ టెక్స్ట్ ను ఉపయోగించాలి. యానిమేషన్ ద్వారా మరి కొంత ఎక్కువ ఎఫెక్ట్స్ ఇవ్వ వచ్చు.
ఇంట్రో లను జోడించడం ద్వారా కూడా మనం ప్రత్యేక ఆకర్షణ తేవచ్చు. పవర్ పాయింట్ నందు వీడియో క్లిప్పింగ్ లను కూడా సందర్భానుసారంగా చూపించ వచ్చు. స్లైడ్ ప్రజెంటర్ ఒక స్లైడ్ షోస్ తయారు చేసే సమయం లో 3 రకాల ఫార్మేట్స్ లో మన స్లైడ్ షో సిద్ధం చేసుకోవాలి .
వాటిల్లో
1. బేసిక్ స్లైడ్ షో - దీనితో మనం ఏ సమయంలో అయినా సరే ఎడిట్ చేసుకోడానికి వీలు కలుగుతుంది.
2 . స్లైడ్ షో ఫార్మేట్ - ఒక వేళ మనం ఉపయోగించే కంప్యూటర్ లో పవర్ పాయింట్ లేనప్పుడు డైరెక్ట్ వీడియో ఫార్మేట్
3. ఫోల్డర్ ఫార్మేట్ - అన్ని రకాల ఎలిమెంట్స్ ఉండే విధంగా ఫోల్డర్ ఫార్మేట్ లో ఉపయోగించాలి.
ఒక స్లైడ్ ప్రజెంటర్ గా మీ ప్రజంటేషన్ తయారు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలను పాటించాలి. ప్రజంటేషన్ సింపుల్ ఫార్మేట్ లో ఉండాలి. పాయింట్ వైజ్ టెక్స్ట్ 72 శాతం మాత్రమే ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ ముఖ్యమైన టెక్స్ట్ ని బోల్డ్ ఫార్మాట్లో ఉపయోగించాలి. ట్రాన్స్ ఫర్మేషన్ యానిమేషన్స్ తక్కువగానే ఉపయోగించాలి. బ్యాగ్ గ్రౌండ్స్ కోసం ఉపయోగించే ఫోటోస్ ను , డైరెక్ట్ ఎలిమెంట్ ఫోటోస్ ను హై రెజల్యూషన్ , మంచి లుక్ ఉన్న టాపిక్ రిలేటెడ్ ఫోటోస్ ని సేకరించి ఉంచుకోవాలి.
విజువల్ ఫ్రేమ్స్ ని ఎక్కువగా ఉపయోగించాలి తప్ప , పవర్ పాయింట్ బ్యాగ్రౌండ్ , డీఫాల్ట్ థీమ్స్ ఉపయోగించకూడదు. వీటి సాయంతో మనం ప్రొఫెషనల్ లుక్ ఉండేలా చేసుకోవచ్చు. సమాచారాన్ని ఎక్కువగా టెక్స్ట్ కాకుండా ... సాధ్యమైనంత వరకు విజువలైజేషన్ చార్ట్స్ ఉపయోగించుకోవచ్చు. కలర్ వాల్స్ ఉపయోగించాలి.
ఫాంట్స్ ఎక్కువ రకాలు ఉపయోగించకుండా హెడ్డింగ్ , సబ్ హెడింగ్ , కంటెంట్ టెక్స్ట్ కోసం ఒకే విధమైన ఫాంట్ మోడల్ ను ఉపయోగించాలి. వీడియో , ఆడియో ఫార్మేట్స్ సాధ్యమైనంత వరకు క్లీయర్ గా ఉండాలి. మీరు స్లైడ్ ప్రజెంటర్ గా ఎదగాలని అనుకుంటే ఒక ప్రజంటేషన్ చేసే సమయంలో ఎక్కువ సమయాన్ని కేటాయించే ఓపిక చాలా అవసరం.
ఇది ఇలా చాలు.. ఇంతకన్నా ఎక్కువ చేయలేం అనే కాంప్రమైజ్ వద్దు. మన స్కిల్స్ మొత్తం బయటకి తీసుకోచ్చేదిగా ఉండటమే కాదు. అందరికీ అర్ధం అయ్యే విధంగా... మరి ఎక్కువ సమయాన్ని ఉపయోగించ కుండా.. ఇచ్చిన సమయంలోనే పూర్తయ్యే విధంగా సమయాన్ని ఎలాట్ చేయాలి.
మీకు అవసరమైన లింక్స్ : Powerpoint, Backgrouds Images, Whiteboard & Green Board, Logo Making ,
1 Comments
Blog Look Is Nice Friend.. Also Visit My Blog
ReplyDelete