Online Classes
* ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్స్ కి ఎక్కువ ఆదరణ చూపుతున్నారు. ఇక ముందు కూడా సాంప్రదాయిక తరగతి గదులు, లెసన్స్ , సెషన్స్ కాకుండా...ఆన్ లైన్ లెర్నింగ్ కి ఆదరణ ఎన్నో రెట్లు పెరగబోతుంది అనడంలో సందేహం లేదు. దీని వల్ల సమయం ఆదా కావడమే కాదు సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్ దగ్గర అసంఖ్యాక విద్యార్ధులు తయ్యారు చేయబడతారు.

 * మనం ఒక ఆన్ లైన్ సెషన్ ను తీసుకోవాలని అనుకున్నప్పుడు, లేదా సెషన్స్ సమర్ధవంతంగా ముందుకి తీసుకు వెళ్లాలని అనుకున్నప్పుడు మనం దృష్టి పెట్టాల్సిన అంశాలను గురించి గమనిస్తే, ముందుగా మనం తీసుకోవాలనుకున్న అంశాన్ని సెలక్ట్ చేసుకోవడం మొదలు విద్యార్ధుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకునే దాకా జాగ్రత్త వహించాలి. 

* మన కోర్స్ టాపిక్ ను సెలక్ట్ చేసుకునేందుకు... ముందుగా ఆ టాపిక్ గురించి వీలైనంత ఎక్కువ సమాచారాన్ని అధ్యయనం చేయాలి. మిగతా అన్ని సెషన్స్ తో పోల్చుకున్నప్పుడు మన సెషన్ లో ఎక్కువ సమాచారం తెలిసే విధంగా అంశాన్ని గురించి తెలుసుకోవాలి. మనం తీసుకున్న టాపిక్ చాలా ఆదరణ ఉండే విధంగా ఉండాలి. ఎక్కువ మందికి మన సెషన్స్ చేరాలి. 

* మన సెషన్ కి అటెండ్ అయ్యే ఆడియన్స్ ని టార్గెట్ చేసే విధంగా ఉండే అంశాన్ని తీసుకోవాలి. దీని కోసం టాపిక్ రీసెర్చ్ కోసం సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఆధారంగా సర్వే , పోల్స్ నిర్వహించ వచ్చు, గూగుల్ ఫాం ఆధారంగా టార్గెట్ ఆడియన్స్ ఏ వయసు వారు మన అంశానికి దగ్గరగా ఉండాలి, జెండర్ మరియు వారి ఉద్యోగ స్థితి ఆధారంగా కోర్స్ ప్లాన్స్ చేయాలి. 

* మనకి ఉన్న విజ్ఞానం మేరకు అంశాన్ని గురించి అధ్యయనం పూర్తయ్యాక దానికి అవసరమైన కోర్స్ సిలబస్ , ఏ టాపిక్ కింద ఎంత సమయం ఏ సెషన్స్ కి కేటాయిస్తున్నామనే అంశాలను గురించి ఒక అంచనా కి రావాలి. ఈ సబ్జెక్ట్ ను వివరించడానికి అవసరమైన మోడల్స్ , పవర్ పాయింట్ ప్రజెంటేషన్, వీడియో సోర్స్ ఫైల్స్ , నోట్స్ కోసం పీడీఎఫ్ ఫార్మేట్ సెషన్స్ ని సిద్ధం చేసుకోవాలి. 

*సెషన్స్ తీసుకునే సమయంలో ఎటువంటి అంతరాయం లేకుండా క్లియర్ కట్ గా ఉండే సాఫ్ట్ వేర్ ను ఉయోగించడం, వాటికి సంబంధించిన పర్ఫెక్ట్ సెట్టింగ్ లను గురించి ప్రజెంటర్ కి తప్పని సరి పరిజ్ఞానం అవసరం. ఈ కోర్స్ కంటెంట్ లో టెక్స్ట్ , వీడియో మరియు గ్రాఫిక్ కంటెంట్ సరైన విధంగా అర్ధం చేసుకునేందుకు వీలుగా ఆకర్షణీయంగా ఉండడం చాలా అవసరం. 

*మనం వివరించే అంశానికి సంబందించి మనం సెట్ చేసుకున్న సమయాన్నే వాడే విధంగా ముఖ్యమైన అంశాలకు కేటాయించే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మన అంశాలను గురించి చర్చించడానికి కమ్యూనికేషన్ ద్వారా కలిపి ఉంచాలి. మనం అందించిన కోర్స్ కంటెంట్ ఆధారంగా ఫీడ్ బ్యాక్ పొందడం మాత్రం మరచి పోవద్దు. 

* మనం అందించే ఆన్ లైన్ కోర్స్ గురించి అప్డేట్ ,మరియు కొత్త అంశాలను నేర్చుకోవడానికి వెనుకాడకుండా నిత్య విధ్యార్ధిలా రీసెర్చ్ సాగించి , మనకి ఉన్న స్కిల్ల్స్ గురించి మరింత అధ్యయనం చేయడం ద్వారా కొత్త పరిధులను, దాటి మన సబ్జెక్ట్ ని గురించి అధ్యయనం చేసి మార్పులని అంగీకరించాలి. నిరంతరం టీచింగ్ మెథడ్ ని అబ్జర్వ్ చేసుకుంటూ పోవాలి. 

మీకు అవసరమైన లింక్స్ :
Youtube , Google Class Room, Share Skill (డిజిటల్ ప్లాట్ ఫామ్స్)
స్ట్రీమింగ్ సాఫ్ట్ వేర్ ( ఫ్రీ స్క్రీన్ షేర్ కోసం)