* మీరు గ్రాఫిక్ డిజైనర్ గా కెరీర్ ను ప్రారంభించడానికి మొదట కనీసం కంప్యూటర్ ఉపయోగించడం తెలియాలి. దానితో పాటుగా మీరు
1. అడోబ్ ఫోటోషాప్
2. పేజీ మేకర్
3. అనూ స్క్రిప్ట్
( తెలుగు వర్క్ చేయాలంటే ఇది తప్పనిసరిగా నేర్చుకోవాలి. యాపిల్ కీ బోర్డ్ కోడింగ్ ) పై పట్టు సాధించాలి. దీనికి ఉపయోగపడే ఉన్నో పుస్తకాలు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. (తేలికగా అర్ధం చేసుకునే తెలుగు పుస్తకం ఇక్కడ నుండి డౌన్ లోడ్ చేసుకొండి.)
* ఈ మూడు సాఫ్ట్ వేర్ లతో పాటుగా ఎడోబ్ ఇన్ డిజైన్ , ఆఫ్టర్ ఎఫెక్ట్, కోరల్ డ్రా... లాంటి సాఫ్ట్ వేర్ లు నేర్చుకోవడం ద్వారా ఎక్కువ అవకాశాలని పొందవచ్చు. గ్రాఫిక్స్ మాత్రమే కాకుండా తెలుగు టైపింగ్ లో తప్పులు లేకుండా , కంటెంట్ రైటింగ్ చేయగల స్కిల్ కలిగి ఉండడం చాలా మంచిది.
*ఈ రంగంలో సెట్ కావడానికి ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకోవాలి. దీని కోసం మొదటగా బ్యాగ్రౌండ్ వర్క్ చేయవలసి ఉంటుంది. దీనికోసం మీరు మీ వర్క్ ను సోషల్ మీడియా సైట్స్ లో మన వర్క్ కావలసిన క్లయింట్లకు చేరే విధంగా, మన వర్క్ ను పబ్లిష్ చేయవలసి ఉంటుంది ( ఉదా : ప్రత్యేక సందర్భాల్లో గిఫ్ట్ గ్రీటింగ్స్, గ్రాఫిక్ కార్డ్స్ తయారు చేసి పెట్టడం లాంటివి )
*మార్కెట్ లో ప్రస్తుతం ఉన్న గ్రాఫిక్స్ కన్నా , ప్రత్యేకంగా ఉండాలి, దానితో పాటుగా కాస్త తక్కువ ధరకి ఇచ్చే విధంగా ఉండాలి. మన వర్క్ బ్రాండ్ పడే వరకు తక్కువ ధరల్లో లేదా పూర్తీ ఉచితంగా తయారు చేయడానికి కూడా వెనుకాడ కూడదు. ఈ దశలోనే మనం మన గ్రాఫిక్స్ కంటెంట్ ద్వారా కంపెనీ లను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి.
*ఎక్కువగా పెద్ద పెద్ద కంపెనీలకి డైరెక్ట్ గా ఆఫర్ రావు. చిన్న చిన్న లోకల్ బిజినెస్ కోసం , సోషల్ మీడియా మార్కెటింగ్ వర్క్ కోసం పోస్టర్ కార్డ్స్ డిజైనింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి.
*మనం గ్రాఫిక్స్ లో ప్రతీ దాన్ని అందంగా చూపించగలం దానికోసం ప్రొఫెషనల్ లెవల్ వర్క్ , కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ , కొత్త కొత్త ఎఫెక్ట్స్ కోసం ఆన్ లైన్ ద్వారా , ఆఫ్లైన్ ద్వారా నిత్య విద్యార్ధి గా నేర్చుకోవాలి. బేసిక్ గా గ్రాఫిక్స్ డిజైనింగ్ వర్క్ కోసం ఉచిత సాఫ్ట్ వేర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
మీకు అవసరమైన లింక్స్ :
అనూ స్క్రిప్ట్ ( తెలుగు టైపింగ్ కోసం )
పేజీ మేకర్ ( బుక్ కంపోజింగ్ కోసం )
ఫోటో షాప్ ( ఫోటో గ్రాఫిక్స్ సాఫ్ట్ వేర్)
డీటీపీ నేర్చుకుందాం ( తెలుగు గైడ్ బుక్ )
0 Comments