Photography 
మీరు ఒక ఫోటో గ్రాఫర్ గా / వెడ్డింగ్ ఫోటో గ్రాఫర్ గా ఎదగాలని అనుకుంటే మొదటగా ఫోటోగ్రఫీ పట్ల అభిరుచి ఉండడం చాలా ముఖ్యం. దీనిని ఏదో సంపాదన కోసం మొదలు పెట్టారంటే మీకు శ్రమ మాత్రమే మిగులుతుంది. మొదటగా ఈ ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్స్ ఇచ్చే టెక్నిక్స్ వారు రాసే జనరల్స్ ని అధ్యయనం చేయండి. దీని ద్వారా ప్రస్తుతం ఉన్న మార్పులు గురించి ఒక ఐడియా వస్తుంది. 

ఫోటోగ్రఫీకి సంబంధించి బేసిక్ అక్విప్ మెంట్ ( పరికరాలతో ) ఫోటోగ్రఫీ మొదలు పెట్టడం కాకుండా అవసరమైన అన్ని అక్విప్ మెంట్, వాటిని ఉపయోగించడం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. జూమ్ లెన్స్ ఎఫెక్ట్స్, వాటిని ఉపయోగించడం గురించి, అలాగే ఒక గ్రాఫిక్ ఆల్బం లో ఉపయోగించే ఫోటో షాట్స్ గురించి కూడా తెలుసుకోవాలి. 

మనకు ఫోటో గ్రాఫిక్ ఆల్బమ్ కోసం ప్రత్యేకించి డిజైనర్ ను పెట్టుకోవడం కన్నా , ఒక ఫోటో గ్రాఫర్ గా మీరే ఎడిటింగ్ గురించి నేర్చుకొని ఉండడం వాల్ల రియల్ టైం ఫీల్డ్ వర్క్ సమర్ధ వంతంగా వస్తుంది. ఒక వీడియో , ఫోటో ఎక్వీప్ మెంట్ కే పరిమితం కాకుండా డ్రోన్ లను ఉపయోగించి కూడా వీడియో షాట్స్ ఉపయోగించి సినిమాటిక్ గ్రాఫిక్స్ చేయవచ్చు. 

మనం మొదటగా లాభం కోసమే చూడటం పక్కన పెట్టి, గ్రాఫిక్స్ లో, ఫోటో గ్రఫీలో మనకంటూ ఒక ప్రత్యేకత కలిగి ఉండేలా ఒక బ్రాండ్ గా మనమే మారాలి. ఇలా ఒక స్టేజ్ దాక ఫలితాన్ని కాదు, మొదటగా స్థిరత్వం సంపాదించి నిలబడాలి. ఇక్కడ మీరు నెగ్లెక్ట్ చేసే విషయాలు ఏంటంటే.. డెమో ఆల్బమ్ , కాంటాక్ట్ విషయంలో , అవుట్ పుట్ విషయంలో రాజి పడకుండా ఉండాలి. 

సాధ్యమైనంత వరకు బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడం ద్వారా గ్రోత్ బాగుంటుంది. మనం చేసిన వర్క్ ను పబ్లిసిటీ చేయడానికి మన చుట్టూ ఉన్న సోషల్ మీడియా సోర్స్ ను ఉపయోగించుకోవడానికి వీలు కలుగుతుంది. 

ప్రస్తుతం ప్రతీది ఇంటర్నెట్ సెర్చ్ ద్వారానే వెతుకుతున్నారు. మనం ఒక సొంత వెబ్సైట్ , లేదా ఏదైనా సోషల్ మీడియా సైట్స్ నందు సోర్స్ ఫోటో గ్రాఫ్స్ ద్వారా మన క్వాలిటీ నిరూపించే విధంగా అప్డేట్ చేయాలి. కేవలం ఎక్కువ బడ్జెట్ లో నే కాకుండా స్థానికంగా ఉన్న వారికి అనువైన ధరల్లో కూడా చేయాలి. 

ప్రస్తుతం గ్రాఫిక్స్ రంగం లో ఫోటో గ్రాఫిక్స్ కోసం అడోబ్ ఫోటో షాప్ అనే సాఫ్ట్ వేర్ ను , అలాగే వీడియో గ్రాఫిక్స్ నందు అడోబ్ ప్రీమియర్, పినాకిల్ స్టూడియో లాంటి సాఫ్ట్ వేర్స్ ను ఉపయోగితున్నారు. ఈ సాఫ్ట్ వేర్స్ కోసం ఉచితంగా డిజైనింగ్ ఫాంట్స్, ప్లగ్ ఇన్స్ , ఫిల్టర్ , గ్రీన్ స్క్రీన్ లూప్ సోర్స్ అందు బాటులో ఉన్నాయి. వీటి గురించి కూడా పరిజ్ఞానం చాలా అవసరం.

గ్రాఫిక్స్ వర్క్ షాప్స్ , ఫోటో కలెక్షన్ కు సంబందించిన ఫోటో ఎక్జిబీషన్ లకు అటెండ్ అవడం ద్వారా మనకి సరికొత్త ప్రొఫెషనల్ స్కిల్స్ అర్ధం అవుతాయి. వాటికి చెందిన లైటింగ్ ఎఫెక్ట్స్ , వాటి కోసం వాడిన డివైజెస్ గురించి వర్క్ షాప్స్ నందు ఆమూలాగ్రంగా తెలియజేస్తారు. 

ఫోటో గ్రాఫర్ గా మీకు మంచి బ్రాండింగ్ సంపాదించుకునే దాక ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. బ్లాక్ అండ్ వైట్ ఫోటో రిపెయిర్స్ , ఫోటో కంపోజింగ్ గురించి , టైటిల్ మేకింగ్ చేయగల ఆపరేటర్స్ ప్రస్తుతం చాలా తక్కువగానే ఉన్నారని చెప్పాలి. ఇక్కడ మనం ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి. 

ఆల్బమ్ టెంప్లెట్ లను ఉపయోగించే మూస పద్ధతిని పక్కన పెట్టి మన సొంత క్రియేటివిటీ ని ఉపయోగించి యూనిక్ ఆల్బమ్ డిజైన్స్ ని కంపోజ్ చేయడమే మనం చేయాల్సిన మొదటి పని.

మీకు అవసరమైన లింక్స్ : 
ఫోటోషాప్ ను, అనూ స్క్రిప్ట్ మానేజర్ ను తెలుగులో సులువుగా నేర్చుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి.