Youtube Channel Creator |
ఒక యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభం చేయడానికి ముందుగా మీరు ఏ టాపిక్ మీద పూర్తి పట్టు ఉండి కంటెంట్ సిద్ధం చేయగలరో నిర్ణయం తీసుకోండి. అలాగే మనం రాయగల టాపిక్ మీద ఇదివరకే ఛానెల్స్ ఉన్నాయా అనేది వెతికి చూడండి. ఆ లిస్ట్ లో అదే టాపిక్ మీద ఛానెల్స్ ఉన్నాయంటే ఆ కంటెంట్ కన్నా మీరు బెటర్ కంటెంట్ అందించగలరా ? అనేది చూడండి. ఒక వేళ మన దగ్గర అంతకన్నా బెటర్ కంటెంట్ ఉంటే ప్రారంబించొచ్చు.
యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించే ముందు టాపిక్ రీసెర్చ్ ఎలా చేసారో అంతకన్నా జాగ్రత్తగా మీ ఛానెల్ పేరు ని సెలక్ట్ చేయాలి. ఉదాహరణకు మీ ఛానెల్ లో తెలుగు పల్లెటూరు విశేషాలను చెప్పాలనుకుంటే...పల్లెటూరు ముచ్చట్లు, టెక్నాలజీ కంటెంట్ అందించాలని మీరు అనుకుంటే తెలుగు టెక్ టీచర్... ఇలా మన కంటెంట్ ని ప్రతిబింబించేలా ఉండాలి.
యూట్యూబ్ ఛానెల్ లో రకరకాల కంటెంట్ ఇప్పటికే అందిస్తున్నారు. మన కంటెంట్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకోవాలి. టెక్నాలజీ, సైకాలజీ , కుక్కింగ్, ఆర్ట్, క్రాఫ్ట్ మేకింగ్, స్పోట్స్ ఇన్స్ట్రక్షన్స్, ఆయుర్వేదిక్ టిప్స్, యోగా టిప్స్ , హెల్త్ టిప్స్ , బ్యూటీ టిప్స్ , షార్ట్ మూవీస్ , ప్రాంక్ కంటెంట్, మిస్టరీ కంటెంట్, ఆధ్యాత్మికం , జ్యోతిష్యం, వాస్తు... ఇలా ఎవరి కంటెంట్ వారు యూట్యూబ్ ఛానెల్స్ గా స్టార్ట్ చేసారు.
ఈ యూట్యూబ్ ఛానెల్ క్రియేషన్ కోసం ఎలాంటి పేమెంట్ చేయాల్సిన పని లేదు. కానీ, క్రియేటర్ గా మీరు అందించే కంటెంట్ మాత్రం ప్రత్యేకంగా ఉండాలి. అసలు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయడానికి.. ఒక మెయిల్ ఐడీ ద్వారా లాగిన్ అయ్యి, ఆ తరువాత గూగుల్ ప్రొడక్ట్స్ ( జీ మెయిల్ లాగిన్ అయినప్పుడు కుడి చేతి వైపు కనిపించే 9 బాక్స్ ) మీద క్లిక్ చేసి యూట్యూబ్ అనే దాన్ని సెలక్ట్ చేసుకోవాలి.
మొదటగా ఛానెల్ పేరు దానికి తగ్గ లోగో ను సెట్ చేసుకోవాలి. ఆ తరువాత మనం క్రియేట్ చేయాలనుకున్న కంటెంట్ ని రఫ్ కంటెంట్ గా ప్లాన్ చేసుకోవాలి. ఆ తరువాత సినిమా కి బ్యానర్ పేరులా ప్రతీ చీదియో కి ముందుగా వచ్చే ఇంట్రో , చివరకి వచ్చే ఔట్రో సిద్ధం చేసుకోవాలి. దీనిని తయారు చేసుకోవడానికి వీడియో ఎడిటర్ అవసరం లేదు. ఆన్ లైన్ లో వీటిని తయారు చేయడానికి అందుబాటులో ఉన్న వెబ్ సైట్స్ ఉన్నాయి.
మనం తయారు చేసుకున్న కంటెంట్ ని ఆర్డర్ ప్రకారంగా.... వీడియోగా సిద్ధం చేసుకోవడానికి... కొంత వీడియో ఎడిటింగ్ తెలిసి ఉండాలి. దీనికోసం బేసిక్ పరిజ్ఞానం తెచ్చుకోవడానికి వీలుగా ఓపెన్ సోర్స్ వీడియో ఎడిటర్స్ ని ఉపయోగించండి. వీడియో ఎడిటింగ్ కి కంప్యూటర్ ఉండాలని ఏం లేదు మొబైల్ యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
అలాగే మంచి వీడియో క్వాలిటీ ఉన్న మొబైల్ లోనే మన కంటెంట్ ని షూట్ చేయవచ్చు. సౌండ్ క్వాలిటీ ని పెంచడానికి సాఫ్ట్ వేర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇలా తయారు చేసుకున్న ఫైనల్ వీడియో ఔట్ పుట్ ని...ఛానెల్ లోకి అప్లోడ్ చేసి ఆ కంటెంట్ కి తగిన పేరు అవసరమైన డిస్క్రిప్షన్ నోట్స్ యాడ్ చేయాలి.
టెక్నాలజీ వీడియోస్ అయితే అవసరమైన డౌన్లోడ్ లింక్స్ కూడా అందుబాటులో ఉంచడం ద్వారా ఎక్కువ మందిని మన ఛానెల్ లోకి ఎట్రాక్ట్ చేయవచ్చు. ఆ వీడియోలింక్స్ ను అందుబాటులో ఉన్న సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ద్వారా ఎక్కువ మందికి చేరవేయాలి.
ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారంగా 4000 గంటల వాచ్ అవర్స్ అయ్యాక మాత్రమే మానిటైజేషన్ ( యాడ్స్ ద్వారా సంపాదించుకునే అవకాశం కలుగుతుంది) మన కంటెంట్ యూనిక్ గా ఉండేలా చూసుకుంటే వాచ్ అవర్స్ అవే పూర్తవుతాయి వాటీ గురించి దిగులు అవసరం లేదు దీనికి 1 సంవత్సరం సమయం ఉంటుంది.
ఇలా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి యూనిక్ కంటెంట్ అందించి సంపాదించుకునే తెలుగు యూట్యూబ్ ఛానెల్స్ చాలా ఉన్నాయి.
ఉదాహరణకు అరుణ్ సూర్య తేజా ఛానెల్ (జనరల్ కంటెంట్ ) , తెలుగు టెక్ ట్యూట్స్ ( టెక్నాలజీ ) , ఫన్ పటాకా (ప్రాంక్ ఛానెల్), మై విలేజ్ షో ( కామెడీ షార్ట్ ఫిలిమ్స్ )... ఇలా ఎన్నెన్నో ఛానెల్స్ వారి ర్యాంకింగ్ వెనుక కష్టం గమనిస్తే అర్థం అవుతుంది.
మీకు అవసరమైన లింక్స్ : Intro, Outro Making Online,
1 Comments
Nice information in Telugu.
ReplyDelete