ఆన్ లైన్ సర్వే ద్వారా సంపాదించుకుందాం...

Online Survey
ఈ ఆన్ లైన్ సర్వే సైట్స్ కి వర్క్ చేయాలని అనుకునే మనకు ముందుగా ఇంగ్లీష్ ను చదివి అర్ధం చేసుకునే పరిజ్ఞానం ఉండాలి. దీనితో పాటుగా ప్రశ్నకి తగ్గ సమాధానాన్ని ఇచ్చే స్కిల్ ఉండాలి. సర్వే సైట్స్ మొత్తం ప్రతీ ప్రశ్నకు సమాధానాన్ని అందించాల్సి ఉంటుంది. దీనికి తగిన ఓపిక అవసరం. 

మొదటగా ఆన్ లైన్ సర్వే సైట్ ఎంతవరకు పేమెంట్ చేసింది, ఎప్పటి నుండి ఆన్ లైన్ సర్వే నిర్వహిస్తున్నారు అనేది చూసుకోవాలి. ఆన్ లైన్ సైట్ లో మొదటగా ఈ మెయిల్ ఐడీ ఇచ్చి సైనప్ కావాలి. మీ మెయిల్ ద్వారా కన్ఫర్మేషన్ లింక్ ను క్లిక్ చేసుకోవాలి. ఆన్ లైన్ సైట్స్ లో ప్రొఫైల్ వివరాలను నింపి సేవ్ చేయాలి. 

ఈ సైట్స్ నందు సైట్ నిర్వహించే సర్వేల విధానాలను బట్టి డైలీ టాస్క్ , పోల్స్ , ఒపీనియన్ పోల్స్, యాప్ ఇన్ స్టాల్ , యాడ్ క్లిక్ , వీడియో లింక్స్ మరియు యూసర్ సర్వే లను అందుబాటులోకి తీసుకొస్తారు. సర్వే కాలాన్ని అనుసరించి పేమెంట్ మార్క్ చేసి ఉంటుంది. పూర్తి సర్వే చేసాక..సబ్మిట్ చేయాలి. ప్రాసెస్ కంప్లీట్ అవగానే డాష్ బోర్డ్ ఎర్నింగ్ లో ఫీజు మీ ఎకౌంట్ లో చూపిస్తుంది. 

ఆన్ లైన్ సర్వే చేయడానికి కొన్ని విషయాలను గుర్తు ఉంచుకోండి... మొదటగా మనం సర్వే చేస్తున్న సైట్ గురించిన పేమెంట్ హిస్టరీ చూపిస్తుందా..? కొన్ని సైట్స్ లో ఇది అందుబాటులో లేకున్నా... స్కాం అడ్వైజర్ సైట్ ద్వారా వెబ్సైట్ వివరాలను తెలుసుకోవాలి. ఆన్ లైన్ సర్వే చేయడానికి మీరు రెగ్యులర్ గా ఉపయోగించే మెయిల్ ఐడీ కాకుండా... వేరే ప్రత్యేక ఈ మెయిల్ ద్వారా సైన్ అప్ అవడం మంచిది. దీనివల్ల సర్వే సైట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వచ్చినా సరే మనకు ఎటువంటి అంతరాయం ఉండదు. 

మనం సబ్మిట్ చేసిన ఫాం రిజల్ట్స్ ...సర్వే పేమెంట్ గురించి అప్ డేట్ ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని చెక్ చేసుకోవాలి. మీరు కొత్తగా ఆన్ లైన్ సర్వే మొదలు పెట్టాలని అనుకుంటే... నేను ఇక్కడ ఇచ్చిన వర్కింగ్ వెబ్ సైట్స్ ని ప్రయత్నించండి. అంటే ఇక్కడ నేను ఇచ్చిన వెబ్సైట్స్ ఇప్పటి వరకైతే జెన్యూన్ పేమెంట్ అందజేస్తారు. ఇక ముందు ఎలా ఉంటుంది అనేది వర్క్ ని బట్టి ఉంటుంది. 

స్వాగ్ బగ్స్ ,ఇన్ బాక్స్ డాలర్ , స్ప్రింగ్ బోర్డ్ ప్యానల్ ,టోలూనా... మొదలైన సర్వే వెబ్ సైట్స్ పని చేస్తున్నాయి. ఈ ఆన్ లైన్ సర్వే వర్క్ ఏదో ఒక వెబ్ సైట్ కి పరిమితం కావలసిన పని లేదు. 

మనకి ఎంత వరకు అందు బాటులో ఉన్నాయో అన్ని సైట్స్ పేమెంట్ విధానాలని పరిశీలిస్తూ నిర్ణయించుకోవాలి. అంటే తప్ప ఎదో ఒక కంపెనీ ప్రోడక్త్స్ కే పరిమితం కావలసిన పనిలేదు. కానీ , ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి...ప్రతీ సర్వే సైట్స్ నందూ పేమెంట్ ఒకేలా లేవు. ఫ్రీ లాన్సింగ్ వెబ్ సైట్స్ నందు కూడా ఈ కంపెనీ సర్వే లు అందుబాటులో ఉంటాయి. 

ఇవి కాల పరిమితిని బట్టి మీకు పేమెంట్ పర్సెంటేజ్ నిర్ణయించి ఉంటాయి. పెద్ద పెద్ద కాల పరిమితి కల సర్వే కి పేమెంట్ ఎక్కువగా ఉంటుంది. కానీ చాలా త్వరగా సర్వే ను పూర్తి చేసి సబ్మిట్ చేస్తున్న కొద్దీ, మనకి పేమెంట్ ఎక్కువ మొత్తం లో సంపాదించ వచ్చు. మీకు సర్వే వర్క్ ఫ్రీ లాన్సర్ వెబ్సైట్ లిస్టు ఇక్కడ అందుబాటులో ఉంది గమనించండి. 

మీకు అవసరమైన లింక్స్ : 
వెబ్ సైట్ వివరాలు తెలుసుకోవడానికి ( స్కాంఫైండర్ )
 సర్వే వెబ్ సైట్స్ ( స్వాగ్ బగ్స్ ,ఇన్ బాక్స్ డాలర్ , స్ప్రింగ్ బోర్డ్ ప్యానల్ ,టోలూనా)

Post a Comment

1 Comments