అఫిలియేట్ మార్కెటింగ్ చేద్దాం ఇలా...

Affiliate Marketing in Telugu 

* ఒక ఆన్ లైన్ షాపింగ్ వెబ్సైట్ లో ఉన్న ప్రొడక్ట్స్ గురించి, దానికి ఇచ్చే డిస్కౌంట్ గురించి సమాచారాన్ని కస్టమర్స్ కి అందేలా చేయడానికి అందించే సమాచారాన్ని సొంత వెబ్సైట్ ద్వారా కానీ, సోషల్ మీడియా వెబ్సైట్ ప్లాట్ ఫాం గురించి పబ్లిష్ చేయడం ద్వారా షాపింగ్ కష్టమర్స్ పెరిగే విధంగా చేసినందుకు గానూ, సేల్స్ లో కొంత శాతాన్ని మనకి అందజేస్తారు. దీనిని అఫిలియేట్ మార్కెటింగ్ గా చెప్తారు. 

* ఈ విధంగా మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలని అనుకున్నప్పుడు మొదటగా ఒక వెబ్సైట్ లేదా ఇతర సోషల్ మీడియా గ్రూప్ ( ఉదా : ఫేస్ బుక్ గ్రూప్స్ , వాట్సాప్ గ్రూప్...) లో ఉన్న ట్రాఫిక్ ను ప్రత్యేకించిన మార్గాల ద్వారా ట్రాఫిక్ ను మన వెబ్సైట్ లోకి చేరే విధంగా చేయాలి. మనం ఇచ్చే కంటెంట్ ట్రేండింగ్ అయినప్పుడు ట్రాఫిక్ పెరుగుతుంది. 

* మనం ప్రతీ క్షణం అలర్ట్ గా ఉండి, ట్రేండింగ్ టాపిక్స్ పై ఆకర్షించే విధంగా కంటెంట్ రైటింగ్ చేయాలి. మనం ఇచ్చే టాపిక్ కి ఎక్కువ మంది కి రీచ్ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. దీని కోసం మనం తీసుకునే జాగ్రత్తలను ( సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ) ద్వారా రీసెర్చ్ వర్డ్స్ ఉపయోగించాలి. ఇది ఎలా చేయాలనే విషయాన్ని రాబోయే వ్యాసాల్లో నిశితంగా ఇస్తాను. బ్లాగ్ ఆర్టికల్స్ ను రోజు గమనిస్తూ ఉండండి. 

* ఇలా ట్రాఫిక్ ను పెంచుకోవడం ఎంత ముఖ్యమో, మంచి అఫిలియేట్ మార్కెటింగ్ సైట్ ను ఎన్నుకొని జాయిన్ అవడం కూడా ముఖ్యమే. ప్రస్తుతం మన దగ్గర అమెజాన్, ఫ్లిప్ కార్ట్ , స్నాప్ డీల్... ఇలా ఎన్నో ఆన్ లైన్ మార్కెటింగ్ సైట్స్ నందు అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. జన్యూన్ సైట్స్ గురించి రీసెర్చ్ అవసరం. 

*రిజిస్టర్ అయిన అఫిలియేట్ మార్కెటింగ్ ఈ కామర్స్ సైట్స్ నందు మన లాగిన్ ఎకౌంట్ న మనం జనరేట్ చేసుకున్న లింక్ కావాలనుకుంటే... ముందుగా సేల్స్ , ఆఫర్స్ బాగా ఉన్న ప్రోడక్ట్ ను సెలక్ట్ చేసుకొని టైటిల్ ను కాపీ చేసుకోవాలి. ఇప్పుడు మన అఫిలియేట్ మార్కెటింగ్ అకౌంట్ లోకి లాగ్ ఇన్ అయ్యాక, లింక్ జనరేటర్ లో మన ప్రోడక్ట్ పేరు ద్వారా మన లింక్ ను జనరేట్ చేయాలి. లింక్, ఇమేజ్, టెక్స్ట్ యాడ్స్ అనే ఆప్షన్స్ లో మనకు అనువైనది మన వెబ్ సైట్ లో ఉంచాలి. 

* మన సైట్ కి (లేదా) బ్లాగ్ కి (లేదా) సోషల్ మీడియా లో ఉన్న ట్రాఫిక్ ని మన కంటెంట్ ద్వారా ఈ కామర్స్ సైట్స్ ద్వారా అమ్ముడవుతున్న ప్రోడక్ట్ లింక్స్ మీద క్లిక్ చేసి, తద్వారా మనం పెట్టిన ప్రోడక్ట్ ను కొన్నప్పుడు, మన అకౌంట్ ద్వారా జనరేట్ అయిన లింక్ ద్వారా జరుగుతుంది కనుక ప్రత్యేక శాతాన్ని మనకి ఇస్తారు. 

* మనం విజిట్ చేసినప్పుడు అయిన సేల్స్ పై పర్సెంటేజ్ వస్తుంది. ఇలా చేసేది మన అఫిలియేట్ మార్కెటింగ్ సిస్టం. మనకి కావాల్సిందల్లా కొన్ని స్కిల్స్...ప్రస్తుత పరిస్తితుల్లో ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ అవుతున్న పదాలు ఏంటి ?, ఆ టాపిక్ పై ఇంతకు ముందు ఉన్న సైట్స్ లో సమాచారం ఎంతవరకు వచ్చింది. మనం ఆకర్షించే విధంగా ఎలా కంటెంట్ ని రాయగలం అనేది.. నేర్చుకోవాలి. 

* మనీ ఎర్నింగ్ ఒక్కటే కాదు. కంటెంట్ గురించి కూడా పూర్తి పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ట్రేండింగ్ టాపిక్స్ ని ఎలా తెలుసుకోవాలి. మనం మన కంటెంట్ లో ఈ పదాలను ఎలా వాడాలి? మనం గూగల్ లాంటి సెర్చ్ ఇంజన్ లో మన పేజీ top లో కనిపించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే సమాచారాన్నిమీకు ప్రత్యెక పోస్ట్ ద్వారా అందిస్తాను. ఈ బ్లాగ్ లో వ్యాసాలను చెక్ చేస్తూ ఉండండి. 

మీకు అవసరమైన లింక్స్ : అమెజాన్, ఫ్లిప్ కార్ట్ , shopclues (ఈ కామర్స్ సైట్స్)                                                  Sakshi, eenadu ( ఆన్ లైన్ ఈ పేపర్స్) 
                                          Link Shartners

Post a Comment

0 Comments