E Book Publisher |
* ఒక ఆన్ లైన్ పబ్లిషర్ గా కెరీర్ స్టార్ట్ చేసేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. 1 . సొంత కంటెంట్ రాసుకొని దానిని ఈ బుక్ గా మార్చడం ఒక్కటైతే, 2. ఎవరైనా రైటర్ గా పేరుతెచ్చుకొని లేదా మంచి కంటెంట్ రాయగలిగి, ప్రింటింగ్ కోసం ఎదురు చూస్తున్న వారిని సంప్రదించి, సాఫ్ట్ కాపీ వర్క్ చేసి ఈ బుక్ గా మార్చి సేల్ చేసుకోవచ్చు. దీనికోసం కొంత మొత్తాన్ని ముందుగానే మాట్లాడుకున్న విధానం లో వచ్చిన అమౌంట్ ను తీసుకోవచ్చు.
* మీరే రాయాలనుకున్న వారైతే, మొదటగా ఫేమస్ బుక్స్ కొన్ని చదివి, వారి రచన విధానాలను, రీడర్స్ ఎలాంటి విధానాలను ఆదరిస్తున్నారు అనే విధానాన్ని తెలుసుకోవాలి. తరువాత ట్రేండింగ్ టాపిక్స్ ని రీసెర్చ్ చేసి, అనువైన భాష, తప్పుగా రాయకుండా ఉండే విధంగా చూసుకోవాలి. అవుట్ డేటెడ్ సోర్స్ నుండి మీఋ రాసినా పెద్దగా ఉపయోగం ఉండక పోవచ్చు. ఇక్కడ ఒక్క విషయం గమనించండి...మనం మన సొంత సోర్స్ నుండి రాయాలి తప్ప..కాపీ ఒక బ్యాడ్ ఇంపాక్ట్ తీసుకొస్తుంది.
* మీరు రాయాలనుకున్న పుస్తకానికి చెందిన రఫ్ నోట్స్ రెడీ చేసుకొని, దానిని సాఫ్ట్ కాపీగా మార్చడానికి అవసరమైన సాఫ్ట్ వేర్స్ ఉన్నాయి వాటిని మంచి లే అవుట్ వచ్చే విధంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రస్తుతం మనం పబ్లిషింగ్ కోసం వాడే ఎన్నో రకాల సాఫ్ట్ వేర్స్ అందుబాటులో ఉన్నాయి.
*వాటిల్లో పేజీమేకర్ , క్వార్క్ ఎక్స్ ప్రెస్ , ఎం ఎస్ పబ్లిషర్ ( పేజీ లే అవుట్ డిజైనింగ్ , టెక్స్ట్ కంటెంట్ డిజైనింగ్ కోసం ), ఫోటోషాప్, ఇన్ డిజైన్ , ఆఫ్టర్ ఎఫెక్ట్ ( కవర్ పేజీ డిజైనింగ్ కోసం), తెలుగు భాషలో టైప్ చేయాలనుకున్నప్పుడు అనూ స్క్రిప్ట్ (స్క్రిప్ట్ )
* ఇలా తయారు చేసుకున్న పుస్తకాన్ని ఈ బుక్ గా మార్చడానికి ముందుగా ఈ బుక్ పబ్లిషర్ ను సంప్రదించి అవసరమైన కాపీ ఫార్మేట్స్ గా మార్చుకోవాలి. మన పుస్తకాన్ని పరిశీలించి స్క్రీనింగ్ పూర్తయిన తరువాత డిస్ప్లే లోకి వస్తాయి ఉచితంగా.. మనం సూచించిన ధరలో కొంత భాగాన్ని వారి సర్వీస్ కింద తీసుకుంటారు.
*కొన్నిసార్లు మన రీడర్స్ కి ఉచిత గిఫ్ట్ బుక్స్ అందించడానికి కూడా.. వీలు కల్పిస్తుంది. దాదాపుగా మనకి ఈ బుక్స్ అన్నీ పీడీఎఫ్ ఫార్మేట్ లో నే అడుగుతున్నారు కాబట్టి పీడీఎఫ్ క్రియేటర్ సాఫ్ట్ వేర్ ద్వారా ఫైల్ ను రెడీ చేసుకోవాలి.
* పుస్తకానికి తగిన కవర్ పేజీ మరియు డిస్క్రిప్షన్ ను రాయడం చాలా ముఖ్యం. ఒక పుస్తకాన్ని ఈ బుక్ గా మనకి సైట్ లో అప్డేట్ అయినప్పుడు ముందుగా రీడర్ ని ఆకర్షించేది కవర్ పేజీ , కాగా రన్నింగ్ టెక్స్ట్ ప్రముఖ పాత్ర వహిస్తుంది.
*కొత్తగా ఒక పుస్తకాన్ని మార్కెట్ లోకి తీసుకొచ్చినప్పుడు దానికి చెందిన సమాచారాన్ని సోషల్ మీడియా ఇంకా ఇతర సోర్సెస్ ద్వారా రీడర్స్ కి సమాచారాన్ని చేరవేసే విధంగా ఆన్ లైన్ యాడ్స్ , షేర్ చేయాలి.
*కొన్ని ఆన్లైన్ మార్కెట్ సైట్స్ లో మొదటి 10 పేజీలు సాంపిల్ ప్రివ్యూగా ఉచితంగా రీడర్ కి అందుబాటులో ఉంచుతారు. అదీ కాక పుస్తకాలను పూర్తి ధర చెల్లించి కాకుండా, కొంత సమయం కోసం రెంట్ కి కూడా లభిస్తాయి. ఆ సమాచారాన్ని మనకు అందుబాటులో ఉన్న మేరకు రీడర్స్ కి చేరేందుకు ప్రయత్నించాలి.
మీకు అవసరమైన లింక్స్ :
పేజీమేకర్ , క్వార్క్ఎక్స్ ప్రెస్ (సాఫ్ట్ వేర్)
యూనికోడ్ నుంచి అను స్క్రిప్ట్ లోకి మార్చేందుకు (ఆన్ లైన్ సైట్)
------
ప్రస్తుతం ఈ బుక్స్ గా ఉన్న పుస్తకాలు :
కంప్యూటర్ ని ఆజ్ఞాపించుదాం...మొదలైనవి.
2 Comments
PLx Vst My site http:Unicodetoanu.in
ReplyDeletehghjkjkgjkkb
ReplyDelete