Blogging for Business? Here's Everything You Need to Know.
Publish Your Telugu Blog

1. మీరు ఉపయోగించే జీ మెయిల్ (గూగుల్ మెయిల్ లేదా కొత్త జీ మెయిల్ ఎకౌంట్ క్రియేట్ చేసుకోండి) ద్వారా గూగుల్ సెర్చ్ కి లాగిన్ కావాలి. ఈ బ్లాగ్ సర్వీస్ గూగుల్ ప్రొడక్ట్స్ లో ఒకటి కాబట్టి జీ మెయిల్ ద్వారా మాత్రమే బ్లాగ్ క్రియేట్ చేయడం వీలవుతుంది.

2 . గూగుల్ సెర్చ్ పేజీకి కుడివైపున మన ప్రొఫైల్ ఫోటో కి పక్కన 9 బాక్స్ లు గూగుల్ ప్రొడక్ట్స్ అనే డ్రాప్ డౌన్ లిస్టు కనిపిస్తుంది.

3. దానిలో బ్లాగ్ అనే ఐకాన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి, మళ్ళీ మీ మెయిల్ ఐడీ పాస్వర్డ్ రీ ఎంటర్ చేయాలి. వెంటనే బ్లాగ్ పేజీకి రీ డైరెక్ట్ అవుతుంది.

4. మీ బ్లాగ్ కి కావలసిన పేరు, మీరు రాసే టాపిక్ ఆధారంగా ఇవ్వండి. దానికింద బ్లాగ్ అడ్రస్ ను ఇచ్చి రైట్ టిక్ మార్క్ కనిపించగానే నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసి లే ఔట్ ను కంపోస్ చేసుకోవాలి.

5 . పోస్ట్ అనే ప్లేస్ లోకి వెళ్లి మీ కంటెంట్ కి తగిన టైటిల్ ఇచ్చి తెలుగులో టైప్ చేయాలి. మళ్ళీ ఇక్కడ సమస్య ఏంటంటే.. తెలుగు టైపింగ్ కోసం ఒక డీటీపీ ఆపరేటర్ ఏమి అవసరం లేదు. దీనికి ఉపయోగించడానికి...ఆన్ లైన్ ద్వారా, ఆఫ్ లైన్ ద్వారా కూడా ఉపయోగించి కంటెంట్ వ్రాయవచ్చు.

6. దీని కోసం ఆన్ లైన్ ద్వారా అయితే లేఖిని అనే పేజీ అందుబాటులో ఉంది. అదే ఆఫ్ లైన్ లో తెలుగు టైప్ చేయడానికి బరాహా లేదా గూగుల్ ఇన్ పుట్ టూల్స్ ను తెలుగు భాష సెలక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిలో తెలుగు టైప్ చేయడం సెల్ ఫోన్ లో చాట్ చేసినంత తేలికగా ఉంటుంది. కొద్దిపాటి ప్రాక్టీస్ చాలు. దీని ద్వారా టైప్ చేసిన పోస్ట్ కంటెంట్ ని యూనీకోడ్ టెక్స్ట్ అంటారు.

7. ఇక్కడ టైప్ చేసిన టెక్స్ట్ ను కాపీ చేసి, మనం బ్లాగ్ లో పేస్ట్ చేసి, పోస్ట్ చేయవచ్చు. ఇప్పుడు మీరు చేసిన బ్లాగ్ పోస్ట్ ను సాధ్యమైనంత వరకు సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయండి. మనం చేసిన పోస్ట్స్ ఎవరు చూస్తారు అనే నెగటివ్ థింకింగ్ అవసరం లేదు. ఎందుకంటారా...? మీకు తేలికగా వచ్చిన పని , నేర్చుకునే వాళ్లకి తేలిక కావాలని లేదు కదా?

8. ఈ సోషల్ మీడియా గ్రూప్స్ లోనే కాక, బ్లాగింగ్ చేసే వారి గ్రూప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అందులో చేర్చండి. దాని ద్వారా మీ కంటెంట్ కి ఎక్కువ వ్యూస్ వస్తాయి. తెలుగు బ్లాగ్ లు ఎలాగూ చాలా తక్కువ కాబట్టి మీ బ్లాగ్ కి చాలా తేలికగా వ్యూస్ వస్తాయి.

9. ఇక మనం రాసిన కంటెంట్ కి మన సంపాదన కి సంబంధం ఏంటీ? ఇంత చేసిన మనకి మనీ ఎక్కడ నుండి వస్తాయి అంటారా? మీ కంటెంట్ వ్యూస్ పెరుగుతున్నప్పుడు ఒక దశలో గూగుల్ యాడ్స్ ఇవ్వడానికి సంబందించి మానిటైజేషన్ మెయిల్ వస్తుంది. దాని ద్వారా మనం అడ్వర్టైజ్ కి అంగీకరిస్తే..దాని ద్వారా సంపాదన మొదలవుతుంది.

10. ఒక్క సారి మీరు బ్లాగ్ కంటెంట్ గానీ రాయడం మీ దిన చర్య లో భాగంగా చేసుకొని రాయండి. సంపాదన గురించి కాకుండా డైరీ లాగా ఒక అలవాటు చేసుకొని, మీకు పట్టు ఉన్న అంశాల మీద రాయడం మొదలు పెట్టండి. ఒక్క సారి అప్రూవ్ అయిన తరువాత మీ కంటెంట్ ఎవ్రీ గ్రీన్ గా సంపాదించి పెడుతూనే ఉంటుంది.

ఈ గూగుల్ బ్లాగ్ కాకుండా వర్డ్ ప్రెస్ ద్వారా కూడా మీ ఉచిత బ్లాగ్ మొదలు పెట్ట వచ్చు.

మీకు అవసరమైన లింక్స్ :  తెలుగు టైపింగ్ కోసం
                                                 1 . లేఖిని 2. గూగుల్ ఇన్ పుట్ టూల్స్ 3.బరాహా 
                                          కాపీ రైట్ రాకుండా ఉచిత ఫోటోస్ ఉపయోగించ డానికి  : పిక్సాబై
                                          తెలుగు బ్లాగింగ్ గ్రూప్స్ : మాలిక శోధిని మరియు జల్లెడ